G. Sridevi, IMPRI Team
కరోనావైరస్ మహమ్మారి దేశ నలుమూలల ఈ రెండో వేవ్ లో విజృంబిస్తు, దేశ వెన్నుముకలైనటువంటి పల్లెటూర్లని కూడా ముంచెత్తుతుంది . ఇలాంటి సమయంలో, దేశవ్యాప్తంగా గ్రామీణ వాస్తవికతల పై జరుగుతున్న చర్చ కొనసాగింపుగా CHURS (Centre for Habitat, Urban and Regional Studies) మరియు IMPRI (Impact and Policy Research Institute), ఢిల్లీ వారు “గ్రామీణ వాస్తవాలు | తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ | ఈ రెండవ వేవ్ ను ప్రాక్టీషనర్లు ఏ విధంగా పల్లెటూర్లలో ఎదుర్కుంటున్నారు” అనే అంశంపై మే 14 వ తేదీన చర్చ జరిగింది.

కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి తీరు
సెషన్ ను నిర్వహిస్తున్న అధ్యక్షుడు ప్రొఫెసర్ ప్రకాష్ బాబు, స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం (UoH), హైదరాబాద్, తెలంగాణ, చర్చను ఆయన అభిప్రాయాన్ని పంచుకోవడం ద్వారా మొదలుపెట్టారు. ఆయన మాట్లాడుతూ ఈ కోవిడ్ 19 మహమ్మారి లింగ మరియు వయసు అనే అన్ని బేధాలను దాటుకుంటూ సంఘ వ్యాప్తి దశకు చేరుకొని దేశం లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలను ముంచెత్తుతుంది అన్నారు.
ఒక నివేదిక ప్రకారం, ఈ రెండో వేవ్ లో కోవిడ్-19 మహమ్మారి బారిన పడిన గ్రామీణులు 39.6 లక్షల మందికి పైగా ఉన్నారు, ఈ సంఖ్య 2020 సెప్టెంబర్ లో మొదటి వేవ్ యొక్క గరిష్టం కంటే చాలా ఎక్కువ. దీన్ని బట్టి రెండో వేవ్ లో కూడా గ్రామీణులు అంతే ఎక్కువ ప్రభావితులు అయ్యారని నిర్ధారణకు రావచ్చు.
ఈ రెండో వేవ్ లో గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేమి, అజ్ఞానం మరియు పోషకాహార లేమి మరింత విస్తృతమైన సమస్యలు గా మారాయి. మొదటి వేవ్ మరియు రెండో వేవ్ లోను కోవిడ్ లక్షణాలు భిన్నంగా ఉండటం వలన వ్యాధి మరియు దాని వలన వచ్చే లక్షణాలను గుర్తించడం గ్రామీణులకు సమస్యగా మారింది.

గ్రామీణ ప్రాంతాల్లో యుక్తవయస్సు వారు కోవిడ్ కు మరింత ప్రభావితమవుతున్నారు. అదే సమయంలో వాక్సినేషన్ కు సంబంధించిన సౌకర్యాలు లేకపోవడం కూడా ఆందోళన చెందాల్సిన విషయం. ఇది ఇలా ఉండగా 45 సంవత్సరాలు తక్కువ వయస్సు ఉన్నవారికి కోవిడ్ వచ్చినా కూడా ఏ లక్షణాలు లేకపోవడం వలన ఎక్కువగా వ్యాప్తి చెందడానికి దోహద పడింది. కనీస సౌకర్యాలు లేకపోవడం వలన గ్రామీణ ప్రాంతాల్లో అధిక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
చర్చను కొనసాగిస్తున్నటు వంటి Dr శ్రీదేవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే తెలంగాణలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు తక్కువగా చేస్తూ పాజిటివ్ కేసులను తక్కువ చేసి చూపుతున్నారు అని పేర్కొన్నారు. మరో పక్క ఆంధ్ర ప్రదేశ్ ఎక్కువ టెస్టులు చేయడం ద్వారా నమ్మదగిన సమాచారాన్ని ఇస్తున్నారు అని పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ రెండు రాష్ట్రాలు ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను భాగంగా మానవ శక్తి ని పెంచడం కానీ ఔషధాలను పొందు పరిచే విషయం లో విఫలమయ్యారు అని పేర్కొన్నారు.
కోవిడ్ మహమ్మారి లా వ్యాప్తి చెందినప్పటికీ, ఆరోగ్య సంరక్షణలో ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం తెలంగాణలో 3.3%, ఆంధ్రప్రదేశ్‌లో 5% మాత్రమే.

రెండో వేవ్ లో కేసులు పెరగడానికి ముఖ్యకారణాలు :
- లాక్డౌన్ నియమాలు కఠినంగా లేకపోవటం
- టీకా విధానం అమలులో కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో వైఫల్యం చెందడం
- టీకా డ్రైవ్ పట్ల గ్రామీణులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం చెందడం
- గ్రామీణ, పట్టణ మరియు రాష్ట్ర స్థాయి లో వివిధమైన పక్షపాత వైఖరి ఉండడం
- టీకా కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉండటం వలన గ్రామీణులకు వెసులుబాటు లేకపోవడం
- ఆక్సిజన్, మందులు మరియు వ్యాక్సిన్ కొరత కారణంగా గ్రామీణ మరియు పట్టణ ప్రజల పైన ఆర్థిక భారం పడటం
- గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఆరోగ్య వ్యవస్థ లేకపోవడం
- రాష్ట్ర మద్దతు పాలసీ లు కూడా వివక్షా భరితంగా ఉండటం

ఆన్లైన్ వాక్సినేషన్ డ్రైవ్ పద్ధతి కన్నా గ్రామీణ ప్రాంతాల్లో వారికి నేరుగా చేరేలా వాక్సినేషన్ డ్రైవ్ చెయ్యాల్సిన అవసరం ఉంది.
– Dr G శ్రీదేవి
పోషకాహార లోపం వలన ముప్పు పెరగడం
Dr శ్రీదేవి గారు మాట్లాడుతూ, NFHS (National Family Health Survey) నివేదిక ప్రకారం భారతదేశంలో పోషకాహార లోపం చాలా ఎక్కువగా ఉందని అన్నారు. ఈ నివేదిక ప్రకారం, దేశం లోని 14 రాష్ట్రాలు అధిక స్థాయిలో పోషకాహార లోపంతో బాధపడుతున్నారు, వీరిలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో మరింత ఎక్కువగా ఉంది. మరియు 60 శాతం పునరుత్పత్తి దశలో ఉన్న మహిళలు మితమైన లేదా తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ పోషకాహారా లోపం వారి యొక్క రోగనిరోధక శక్తిని తగ్గించి మరణానికి దారితీస్తుంది అన్నారు.

ఇప్పటికే అధిక స్థాయిలో ఉన్న పోషకాహార లోపం మరియు పేదరికం సమస్యలను పరిష్కరించకుండా, ఈ కోవిడ్ మహమ్మారి ని మరియు ఊహించబడుతున్న మూడవ వేవ్ ను ఎదుర్కోవడం కష్టం.
Dr G శ్రీదేవి
అంటువ్యాధుల వల్ల నిరంతర సవాళ్లు మరియు నిర్లక్ష్యం
కోవిడ్ గురించి మాట్లాడుతూ పాలసీ ఎక్స్పర్ట్, SDG క్యాంపైగ్నేర్, దొంతి నరసింహ రెడ్డి, వాస్తవ గణాంకాల కంటే ప్రజలు వివిధ అభిప్రాయాలని నమ్ముతున్నారు, వారికి వాస్తవికత అర్థం అయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంది అన్నారు.
Dr శ్రీదేవి గారి వాదనలు సమర్థిస్తూ, గత రెండు దశాబ్దాలుగా గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాలు నిర్లక్ష్యం చేయబడ్డాయని, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రైవేటీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని, రోగనిర్ధారణ కేంద్రాలు, పారిశుద్ధ్య సేవలు మొదలైనవి ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రైవేటీకరించబడుతున్నాయని, దొంతి నరసింహ రెడ్డి అన్నారు.
దొంతి నరసింహ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్‌లోని వ్యాధుల చరిత్ర గురించి మాట్లాడుతూ, గతంలో వైరల్ ఫీవర్స్, జపనీస్ ఎన్సెఫాలిటిస్, చండిపురా వైరస్, ఆంత్రాక్స్, HIV, చికున్‌గున్యా, మలేరియా వంటి అంటు వ్యాధులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విధంగా అన్ని వ్యాధులు పెరగడానికి ఆంధ్ర ప్రదేశ్ లో పోషకాహార లోపం, నిర్వహణ లోపం మరియు నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు.
దొంతి నరసింహ రెడ్డి గారు కోవిడ్-19 వల్ల విధించిన లాక్ డౌన్ ప్రక్రియ గురించి మాట్లాడుతూ దీనివల్ల చిన్నకారు ఉద్యోగులు వారి యొక్క జీవనోపాధిని కోల్పోయి బాగా నష్టపోయారు అన్నారు. ఇది ఇలా ఉండగా రెండు రాష్ట్రాల్లో వివిధ చేనేత నేత కార్మికులు తీవ్రంగా ప్రభావితమయ్యారు అన్నారు .
పోషకాహార లోపం, అధిక రక్తపోటు, మరియు వాయు కాలుష్యం, వృత్తి పరమైన ప్రమాదాలు మొదలైనవి ఆంధ్రప్రదేశ్‌లో మరణాలు మరియు వైకల్యానికి కారణమయ్యే వివిధ ప్రమాద కారకాలు గా చెప్పుకోవచ్చు అన్నారు. వీటిలో ముఖ్యంగా పోషకాహార లోపం అధికంగా ప్రభావితం చేస్తుంది అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపం వలనే రోగనిరోధక శక్తి తగ్గి మహమ్మారి వ్యాప్తికి దోహదం చేస్తుంది
Dr దొంతి
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ వ్యాప్తి గురించి ప్రస్తావిస్తూ తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని అన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో చూసినట్లయితే గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండిటి లో యాక్టివ్ కేసులు సమానంగానే పెరుగుతున్నాయని దోంతి నరసింహ రెడ్డి చెప్పారు.
రోగాలను మరియు మహమ్మారిని గుర్తించడం, నిర్ధారణ చేయడం, చికిత్స చేయడం మరియు పోస్ట్-ట్రీట్మెంట్ పరంగా సంస్థాగత మార్పును తీసుకురావడంలో మనం విఫలమయ్యాము
Dr దొంతి
Dr దొంతి గారు చెప్పిన ముఖ్యాంశాలు :
- వ్యాప్తి చెందే రోగాలు కేవలం పేదలకు, గ్రామీణులకు మరియు గిరిజనులకు మాత్రమే వస్తుంది అనే అపోహ లో ఉండటం
- గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో వార్షికంగా వైరల్ జ్వరాల బారిన పడటం
- ప్రైవేటీకరణ మరియు ప్రభుత్వ రంగాల్లో పెట్టుబడులు లేకపోవడం
- పోషకాహార అందుబాటు
- వ్యక్తిగత, కుటుంబ, సంఘం మరియు ప్రభుత్వ స్థాయిలో కోవిడ్ కు సంబంధించిన ప్రతిస్పందన సంస్థాగత స్థాయిలో విచ్ఛిన్నం చెందడం
కోవిడ్ మహమ్మారి వలన దీర్ఘకాలిక మానసిక సమస్యలు ఉంటాయి మరియు రానున్న 7 – 8 సంవత్సరాలలో పెరుగుతాయి.
Dr వరూధిని కంకిపాటి
కోవిడ్-19 సమయంలో మానసిక ఆరోగ్య ప్రాధాన్యత
ఇన్నర్‌కనెక్ట్ కో-ఫౌండర్ , Dr వరూధిని కంకిపాటి మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యంపై అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కోవిడ్ గురించిన భయం వల్ల మరియు ఈ మహమ్మారి ఏ విధంగా వారి పై ప్రభావం చూపుతుందో అనే ఆందోళన వలన చాలా మంది మానసిక రుగ్మతులకి లోనవుతున్నారని చెప్పారు
ఈ భయం అనేది సంఘం నుంచి పరిసరాలకు, పరిసరాల నుంచి కుటుంబాలకి, కుటుంబాల నుంచి వ్యక్తులకి సంభవిస్తే జనాలలో అసహాయత పెరుగుతుంది. ఇవన్నీ ప్రజల్లో భయం ,దీర్ఘకాలిక ఆందోళన మరియు నిస్సహాయ బావన నిద్రలేమి, ఆకలిలేమీ వంటి మానసిక మరియు శారీరక ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం చూపుతాయి అన్నారు.
వరూధిని మాట్లాడుతూ, మీడియా కూడా బాధ్యత తీసుకుని కేవలం ప్రతికూల వార్తలనే కాకుండా ఆశను చిగురించే వార్తలను కూడా చూపించాలి అన్నారు. అదేవిధంగా ఈ మహమ్మారి యెక్క ప్రభావం వ్యక్తుల మీద మరియు సంఘాల మీద ఎలా ఉంటుందో అని వివరించారు. కుటుంబం యొక్క మానసిక ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు అని వరూధిని గారు చెప్పారు.
పంపిణీలోనిఅసమానతలనుఅర్ధంచేసుకోవలసినసమయం
కాంటినెంటల్ హాస్పిటల్స్ యొక్క క్రిటికల్ కేర్ యూనిట్ చీఫ్ మరియు సీనియర్ కన్సల్టెంట్ ఇంటెన్సివిస్ట్ Dr P B N గోపాల్, మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలను 2014 లో విభజనకు ముందు దాదాపు అర్ధ శతాబ్దం పాటు మొత్తం సామాజిక-రాజకీయ మరియు వైద్య వ్యవస్థ అంత కూడా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమై ఉందని వివరించారు.

వైద్య పరమైన మౌలిక సదుపాయాలు మరియు విద్యా వ్యవస్థ తెలుగు రాష్ట్రాల్లో సమానంగా అభివృద్ధి చెందలేదు అన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో వైద్య సదుపాయాలలో కూడా చాలా వ్యత్యాసం ఉంది ఇలాంటి సమయంలో నే కోవిడ్ వ్యాప్తి చెందింది అన్నారు.
కోవిడ్ మొదటి వేవ్ తో పోల్చి చూస్తే రెండో వేవ్ లో ఫలితాలు చాలా భిన్నంగా ఉన్నాయి. కోవిడ్ యొక్క మొదటి వేవ్ జాతి పరంగా ఎదుర్కొంది అదే రెండో వేవ్ లో ప్రాంతాల వారీగా ఎదుర్కొన్నారు.
కోవిడ్-19 అనేది ప్రతి మనిషి యొక్క వ్యాధి, కానీ చికిత్స సౌకర్యాలు మాత్రం అందరికి
Dr P B N గోపాల్
ప్రజలకు ఏ విధమైన వైద్య ఆరోగ్య సదుపాయాలు చివరి వరకు అందుతున్నాయి అనే దాని పై ఎటువంటి పారదర్శకత లేదు అని Dr గోపాల్ పేర్కొన్నారు. ఈ మహమ్మారి మధ్యలో వాక్సినేషన్ ప్రారంభించడం మరియు సరైన నివారణ చర్యలు తీసుకోకపోవడం వలనే రెండో వేవ్ విజృంభణకు కారణం అన్నారు.
Dr గోపాల్ గారు మాట్లాడుతూ వలస కూలీలకు కూడా వాక్సినేషన్ ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది అన్నారు. రెండో వేవ్ లో జనాభాలో ఎక్కువ మంది చిన్నవారు, యువకులు మరియు అనారోగ్యంతో ఉన్నారు కోవిడ్ వ్యాధి బారిన పడ్డారు ఫలితంగా మరణాలు పెరిగాయి అన్నారు .
రెండవ వేవ్ ఒక పెద్ద మంచుకొండ వంటిది ఇప్పుడు మనం కేవలం దాని కొనను మాత్రమే చూస్తున్నాము మరియు దాని వెనుక చాలా ఉంది
Dr P B N గోపాల్
వైద్య సదుపాయాల గురించి Dr గోపాల్ మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షలు, టీకాలు వేయడం మరియు చికిత్స చేయటం లో తీవ్రంగా కొరత ఉంది అన్నారు. సరైన ఆదేశాలు లేక రెండు రాష్ట్రాల లోను ఆసుపత్రుల లో పడకల, ఆరోగ్య వర్కర్లు పై సరైన సమాచారం లేదన్నారు.

కోవిడ్ విషయం లో ట్రయ్ఎజింగ్ పాలసీ ని అనుసరించాల్సిన అవసరం ఉంది దీనిలో భాగంగా మొదటి ప్రాధాన్యత వయసులో ఉన్నవారికి అందిస్తే వారు తర్వాత సమాజానికి ఉపయోగపడేలా ఉంటారు, అలా కాకుండా వృద్ధులైన అధిక అనారోగ్యం తో భాద పడుతున్న వారికి ఖర్చు చేస్తే ప్రతిఫలం తక్కువగా ఉంటుంది మరియు అధిక ఖర్చు, అధిక మరణాలు ఉంటాయి అన్నారు. ఆసుపత్రులకు సరఫరా అయ్యే ఆక్సిజన్ విషయంలో కూడా నియంత్రణ లేదన్నారు.
ఎక్కడైతే వ్యాధి సార్వత్రికమో, చికిత్స మాత్రం పట్టణ , కార్పొరేట్ మరియు మెట్రోపాలిటన్
Dr P B N గోపాల్
ప్రభుత్వం దగ్గర ఎంత మంది రోగులు కార్పొరేట్, ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నారు వారికి ఎంత ఆక్సిజన్ ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది, NGO లు ఎంత వరకు సహాయం చేస్తున్నారు అనేది దీనిపై కూడా సమాచారం లేదు అన్నారు.
రెండో వేవ్ లో కోవిడ్ పాజిటివ్ అయిన వారిలో ఊపిరితిత్తులు, మెదడు, పేగు మరియు మూత్రపిండాల యొక్క ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నాయి అని Dr గోపాల్ వివరించారు. మొదటి వేవ్ లో ఊబకాయం ఉన్నవారిలో మరియు వృద్ధుల్లో మరణాలు శాతం ఎక్కువగా ఉండేది. రెండో వేవ్ లో యవ్వన వయసు మరియు అనారోగ్య రోగుల మరణాలు నమోదవడం చుస్తునాం. దీనివల్ల బెడ్ ఆక్యుపెన్సీ రేటు పెరగడం ఫలితంగా బెడ్ దొరకకపోవడం జరుగుతుంది.
రాబోయే రోజుల్లో అయితే లక్షణాలు లేని కారియర్ రేట్ స్థిరంగా అన్న ఉంటుంది లేదా వ్యాధి వ్యాప్తి మరియు వాక్సినేషన్ వల్ల పెరిగే అవకాశం ఉంటుంది
Dr P B N గోపాల్
పౌర సంఘాల సంస్థలను పునరుర్ధించాల్సిన అవసరం
సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ G V రామాంజనేయులు మాట్లాడుతూ కోవిడ్ గ్రామీణ జీవనోపాధి పై తీవ్రమైన ప్రభావం చూపింది అని వ్యాఖ్యానించారు. ప్రజలు ఉద్యోగం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, పరిస్థితి చాలా ఘోరంగా ఉందని అన్నారు. రెండు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాలు పేలవంగా ఉన్నాయి అని అన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల ప్రజలు కులాల ద్వారా మరియు పార్టీలు ద్వారా విభజించబడ్డాయి దానికి తోడు కోవిడ్ ఇక్కడ ప్రజలు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది అని వ్యాఖ్యానించారు.
ఆయన మాట్లాడుతూ సామాన్యంగా పౌర సమాజం ఇచ్చే సలహాలు రాజకీయాలకు ముడిపెడుతూ దాన్ని రాజకీయ సమస్యగా మార్చి, ఎటువంటి ఉపాయం తేలకుండా చేస్తారు. ఇలాంటి వాటివలెనే కింది స్థాయి లో పనిచేసే పౌర సమాజ ప్రేరిత సంస్థలు అన్నీ కనుమరుగైపోతున్నాయి అన్నారు.
ఆరోగ్యంపై కోవిడ్ ప్రభావం గురించి మాట్లాడుతూ, ప్రజలు కోవిడ్ తో పోరాడేటపుడు మానసిక బలం చాలా ముఖ్యమైనదని, జీవించాలనే కోరిక ఉండటం కూడా చాలా బలంగా ఉండటం ముఖ్యం అని చెప్పారు. ఇలాంటి సమయంలో కోవిడ్ కు సంబంధించిన తప్పుడు సమాచారం మరియు పుకార్లను అరికట్టి నిజాల పై అవగాహన తీసుకురావడం చాలా ముఖ్యం అన్నారు.
సమాచార ఆధారిత పారదర్శకతే కోవిడ్ -19 స్పందనను బలోపేతం చేయగలదు
తెలంగాణలో ఉన్న మూడు ముఖ్య విషయాలను ప్రస్తావించారు. అవి ఏంటంటే : ‘
- పార్టీ వ్యవస్థ అతిగా కేంద్రేకృతమవ్వడం
- అన్ని విషయాలలో ప్రభుత్వం కు నియో లిబరల్ మనస్తత్వం ఉండటం
- పౌర సంఘాల వ్యాప్తి
అన్వేషి రీసెర్చ్ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ కోఆర్డినేటర్ Dr A సునీత మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛందంగా పనిచేసే నెట్‌వర్క్‌లను గుర్తించకపోవడం, ఈ స్వచ్ఛంద సంస్థలు స్థానిక అధికారుల పై ఆధారపడేలా చేసింది. అదే సమయంలో, ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల చేత సరుకుల పంపిణీకి జరగనిచ్చినప్పటికీ, వాలంటరీ గా పనిచేసే ఆరోగ్య పరమైన నెట్వర్క్ లను మాత్రం పూర్తిగా పక్కనపెట్టబడ్డాయి.
రాష్ట్రం కోవిడ్ కు సంబంధించిన డేటా ను తక్కువ గా చూపించడం వలన కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు చాలా వరకు తగ్గిపోయాయి అన్నారు. ఒక పక్కన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వార్తలు చూస్తే కోవిడ్ కేసులు మరియు మరణాలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది అన్నారు.
కోవిడ్ కు సంబందించిన విషయంలో ప్రభుత్వం చేతిలో మీడియా కూడా అణచివేయబడింది అని, Dr A సునీత అన్నారు. రాష్ట్రం పేరు నిలుపుకునే ప్రయత్నం లో సరైన పాలసీలను తీసుకురావడం లేదు అన్నారు. కోవిడ్ అనేది అంటువ్యాధి, దీనిని కేవలం హోమ్ ఐసోలేషన్ ద్వారా అరికట్టలేరు, దీనికోసం మరిన్ని ఐసోలేషన్ సెంటర్లు, కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి అందరికి అందుబాటులో ఉంచాలి అన్నారు అని, Dr సునీత అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో జరిగే వాస్తవాలను పారదర్శకంగా చూపించటం కంటే తన యెక్క ఇమేజ్ ను కాపాడుకోవడం లోనే శ్రద్ధ చూపుతుంది
Dr. A సునీత
టీకాల ఉత్పత్తి, సరఫరా మరియు డిమాండ్‌లో ఉన్న అసమానతను పరిగణనలోకి తీసుకుంటే రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో కూడా వాక్సిన్ మొత్తం జనాభాకు అందుబాటులో ఉండదు మరియు సమాజ వ్యాప్తి ద్వారా ప్రజలు సాధించిన కఠినమైన రోగనిరోధక శక్తి మాత్రమే ఆశ, అని ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రొఫెసర్ ప్రకాష్ బాబు, అభిప్రాయపడ్డారు.
కేవలం సాంకేతిక మార్పులు చేయడం వలన వాక్సినేషన్ సమస్యను పరిష్కరించలేము, గ్రామీణులకు వారి పరిసరాల వారీగా ఎటువంటి సమాధానాలు దొరుకుతాయో చూడాలి
Dr దొంతి నరసింహ రెడ్డి
Acknowledgment: Rajeshwari Parasa, and Matta Srinivas for their help in translating the event report too Telugu.